Posts

**ప్రకృతి ప్రేమికులు**

 నాకు ప్రతిరోజూ ఒక సన్నివేశం ఎదురవుతూ ఉంటుంది. ఆ సన్నివేశం చూసిన ప్రతిసారి నాకు ఒక అనుభూతి కలుగుతుంది. ఆ సన్నివేశం ఏంటంటే, ఒక దంపతులు ప్రతిరోజూ దేవుని పూజ కోసం పూవ్వులు కోయటం. ఇందులో విశేషం ఏముంది అందరు చేసేదే కదా, కానీ ఈ దంపతులు ప్రత్యేకం.   ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఒక కప్పు కాఫీ తాగి, వార్త పత్రిక చదివి, ఆ దంపతులు ఒక చిన్న బుట్ట తీసుకొని పెరట్లో ఉన్న మల్లె పందిరికి పూచే పూలని సున్నితంగా ఒక్కొక్క పువ్వు కోసి బుట్టలో వేసి, బుట్ట నిండా పూలు సేకరించి దేవునికి పూజ చేస్తారు. ఈ ప్రక్రియ కనీసం ఒక అర గంట పాటు జరుగుతుంది.  ఆ పూలని సేకరించే సమయంలో వాళ్ళు ఎన్నో విషయాలు చర్చిస్తారు (నా ఊహ ప్రకారం, వాళ్ళు చర్చించే విషయాలు - - రాజకీయాలు, సినిమాలు, చుట్టాల మరియు స్నేహితుల మంచీ చెడులు, పండుగలు, గట్రా.,). ఇది వారి స్వచ్ఛమైన కల్మషం లేని మనసుకు నిదర్శనం. వాళ్ళ పెరట్లో ఎన్నో రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు మరియు వేప చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, వాటిని సాగు చేస్తూ (నీళ్లు పోయటం, పాదులు తీయటం, శుభ్రం చేయటం) వాళ్ళు మంచి కాలక్షేపం చేస్తారు. ఇలా మొక్కలు పెంచటం ...

**నా రైలు ప్రయాణ అనుభవం**

  నేను గుంటూరు నుండి హైదరాబాద్ వెళదామని రైలు టికెట్ రిజర్వేషన్ చేయించుకొని రైల్వే స్టేషన్ లో పావుగంట ఎదురు చూసాక రైలు వచ్చింది.  లోపలకి వెళ్లి సీట్ చెక్ చేసుకొని కూర్చొన్నాను.  వేసవి కాలం అవటం తో సరిపడా గాలి లేక చమట తో   చాలా ఇబ్బందిగా అనిపించింది. కొంతదూరం ప్రయాణించాక , లేచి తలుపు దగ్గర కాసేపు నిలబడదాం అని వెళ్ళాను.  అక్కడ రిజర్వేషన్ లేని వాళ్ళు చాలా మందే నించోని ఉన్నారు ఇరుకుగా.   అప్పుడు నా చూపు ఆ ఇరుకులో ఉన్న నడి వయసు జంట ( మొగుడు పెళ్ళాం ) ఆకర్షించింది.  వాళ్ళు చూడటానికి పల్లెటూరు వాళ్ళ లా ఉన్నారు (వాళ్ళు మాట్లాడుకోవటం విని నాకు అర్థం అయింది). సీట్ దొరక లేదనుకుంటా తలుపు దగ్గర నిలబడి ఉన్నారు , చాలా ఇబ్బందిగా.... ఇంతలో రైలు లో తినుబండారాలు అమ్మే అతను వచ్చాడు! అతను హిందీ వాడు , వీళ్ళకేమో హిందీ రాదు , అతనికేమో తెలుగు రాదు. చివరికి ఏమీ కొనలేదు (భాష తెలియక పోవటం వల్ల). నేను కల్పించుకొని అర్థం చెప్పే లోపే అమ్మే అతను వెళ్ళిపోయాడు చిరాకుగా. వారిద్దరి మధ్య సంభాషణ సరదాగా అనిపించింది. కొంచెం సేపు తర్వాత ఇద్దరు కింద కూర్చుందామని అనుకున్నారు , మ...