**ప్రకృతి ప్రేమికులు**
నాకు ప్రతిరోజూ ఒక సన్నివేశం ఎదురవుతూ ఉంటుంది. ఆ సన్నివేశం చూసిన ప్రతిసారి నాకు ఒక అనుభూతి కలుగుతుంది. ఆ సన్నివేశం ఏంటంటే, ఒక దంపతులు ప్రతిరోజూ దేవుని పూజ కోసం పూవ్వులు కోయటం. ఇందులో విశేషం ఏముంది అందరు చేసేదే కదా, కానీ ఈ దంపతులు ప్రత్యేకం.
ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఒక కప్పు కాఫీ తాగి, వార్త పత్రిక చదివి, ఆ దంపతులు ఒక చిన్న బుట్ట తీసుకొని పెరట్లో ఉన్న మల్లె పందిరికి పూచే పూలని సున్నితంగా ఒక్కొక్క పువ్వు కోసి బుట్టలో వేసి, బుట్ట నిండా పూలు సేకరించి దేవునికి పూజ చేస్తారు. ఈ ప్రక్రియ కనీసం ఒక అర గంట పాటు జరుగుతుంది.
ఆ పూలని సేకరించే సమయంలో వాళ్ళు ఎన్నో విషయాలు చర్చిస్తారు (నా ఊహ ప్రకారం, వాళ్ళు చర్చించే విషయాలు - - రాజకీయాలు, సినిమాలు, చుట్టాల మరియు స్నేహితుల మంచీ చెడులు, పండుగలు, గట్రా.,). ఇది వారి స్వచ్ఛమైన కల్మషం లేని మనసుకు నిదర్శనం.
వాళ్ళ పెరట్లో ఎన్నో రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు మరియు వేప చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, వాటిని సాగు చేస్తూ (నీళ్లు పోయటం, పాదులు తీయటం, శుభ్రం చేయటం) వాళ్ళు మంచి కాలక్షేపం చేస్తారు. ఇలా మొక్కలు పెంచటం తో కొన్ని చిన్న చిన్న పక్షులు గూళ్ళు కట్టుకొని, గుడ్లు పెట్టి, పిల్లలని పొదిగి, ఆ పిల్లలతో ఎంతో హాయిగా ఆ మొక్కల పూలలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ, అదే మొక్కల పై గూళ్ళలో హాయిగా ఉన్నాయి. కేవలం పక్షులకే కాదు, వాళ్ళు మొక్కలు & చెట్లు పెంచటం ద్వారా స్వచ్ఛమైన ప్రాణవాయువు పెంచుతూ ఈ మహానగరం లో కాలుష్యం తగ్గించటానికి వారి వంతు సహాయం చేస్తున్నారు. నాకు తెలిసి ఈ ప్రక్రియ కనీసం ౩౦ సంవత్సరాల నుండి జరుగుతుంది.
వారి మంచి హృదయానికి ఎల్లపుడూ మంచే జరుగుతుంది.
Comments
Post a Comment